NTV Telugu Site icon

NIA: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 5 రాష్ట్రాల్లో 19 చోట్ల ఎన్ఐఏ దాడులు..

Nia

Nia

NIA: నిషేధిత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైష్ ఏ మహ్మద్(జేఈఎం)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపేలా చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతుగా ప్రచారానికి పాల్పడుతున్నారని.. అస్సాం, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లోని 19 చోట్ల దాడులు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని బామ్‌జూ మట్టన్ ప్రాంతం, బారాముల్లాలోని క్రీరీ, బుద్గామ్‌లోని ఖాన్ సాహిబ్ ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.

మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్ రూరల్ పోలీసులు సహకారంతో ఎన్ఐఏ అధికారులు సనంద్ పట్టణంలోని ఆన్‌లైన్ రాడికల్ సంస్థకు చెందిన ఆదిత్ వేపారి ఇంటిలో సోదాలు నిర్వహించింది. ఇతను బనాస్ కాంథా జిల్లా చెఖలా గ్రామంలోని మదరస్సాలో పనిచేస్తున్నాడని తేలింది. మహారాష్ట్రలోని భివాండీ, అమరావతిలో దాడు నిర్వహించారు. భివాండీలోని ఖాడీపూర్ లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో కమ్రాన్ అన్సారీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అన్సారీ దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అమరావతిలోని ఛాయానగర్ ప్రాంతంలో 35 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్‌కి చెందిన ఇస్లామిస్ట్ సంస్థలతో ఇతను సంప్రదింపులు జరుపుతున్నట్లుగా అధికారులు తెలిపారు.

Read Also: MLA Raja Singh : మోహన్‌బాబు క్షమాపణలు చెప్పడం ఉత్తమం.. రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు

అనుమానితుల రహస్య స్థావరాలపై తెల్లవారుజాము నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఎన్ఐఏ సోదాలు నిర్వహించి షేక్ సుల్తాన్ సలా ఉద్దీన్ అయూబీ అలియాస్ అయూబీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన రెండు నెలల తర్వాత ఈ సోదాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే యూపీలోని ఝాన్సీలోని మద్రాస్ ఆపరేటర్ ముఫ్తీ ఖలీద్ నివాసంపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో నిరసనలు చెలరేగాయి. ఎన్ఐఏ చట్టప్రకారం మాత్రమే చేస్తోందని, ఆందోళన చెందాల్సిన పని లేని ప్రజలు చెప్పారు. ఖలీద్‌ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ రోజు జరిగిన దాడుల్లో ఎన్ఐఏ కరపత్రాలను, మ్యాగజైన్‌లను, ఎలక్ట్రిక్ పరికరాలతో సహా పలు నేరారోపిత పత్రాలను స్వాధీనం చేసుకుంది. నిందితులు భారతదేశం అంతటా హింసాత్మక దాడులకు పాల్పడేందుకు పలువురి వ్యక్తుల్ని ప్రేరేపిస్తున్నారని, పలువురిని ర్యాడికలైజ్ చేసేందుకు యత్నిస్తున్నారని ఎన్ఐఏ చెప్పింది.

Show comments