సాధారణంగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయి. కానీ టీకా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంపాటు రక్షణ లభించే అవకాశమే లేదని ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌తో కలిసి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల్లోనే 30 శాతం మందిలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Read Also: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు… ఒక్కరోజులో..
ముఖ్యంగా 40 ఏళ్లు దాటి మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారిలో యాంటీ బాడీల తగ్గుదల ఎక్కవగా కనిపిస్తోందని పరిశోధకులు చెప్తున్నారు. సర్వేలో మొత్తం 1,636 మంది కార్యకర్తలు పాల్గొనగా… వారు రెండు డోసుల వ్యాక్సిన్‌లు తీసుకున్నారు. వీరిలో 93 శాతం మంది కోవిషీల్డ్, 6.2 శాతం మంది కొవాగ్జిన్, 1 శాతం మంది స్పుత్నిక్ టీకాలు తీసుకున్నారు. ఆరునెలల అనంతరం వీరిలో ఐజీజీ-ఎస్1, ఐజీజీ-ఎస్2 యాంటీబాడీలు తగ్గినట్టు గుర్తించారు. 30 శాతం మంది ఆరోగ్య కార్యకర్తల్లో 100 ఏయూ/ఎంఎల్ కంటే తక్కువ స్థాయిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. అంటే వీరికి వైరస్ ముప్పు పొంచి ఉన్నట్లే. ఇలాంటి వారు ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే మిగతావారు కూడా 9 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చని వివరించారు.
