NTV Telugu Site icon

Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన మరో ట్రైన్..

Odisha

Odisha

Odisha: ఒడిశాలో బాాలాసోర్ రైలు ప్రమాదం విషాదం మరిచిపోక ముందే మరో ట్రైన్ పట్టాలు తప్పింది. ఇది కూడా ఒడిశా రాష్ట్రంలోనే జరిగింది. బారాగఢ్ లో గూడ్స్ రైల్ పట్టాలు తప్పింది. ఒడిశాలోని డుంగురి నుంచి బార్‌గఢ్‌కు వెళ్తున్న సమయంలో సోమవారం పట్టాలు తప్పింది. గూడ్స్ రైల్ సున్నపురాయితో నిల్వలలో వెళ్తోంది. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డుంగ్రి సున్నపురాయి గనులు, బారాగఢ్ సిమెంట్ ప్లాంట్ మధ్య ప్రైవేట్ నారో గేజ్ రైలు మార్గం ఉంది. పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యంలో ఈ రైలు నడుస్తోంది.

Read Also: Odisha Train Accident: విషాదం తర్వాత 51 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ.. వందేభారత్‌తో సహా పలు రైళ్ల రాకపోకలు..

శుక్రవారం సాయంత్రం బాలాసోర్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 275 మంది చనిపోయారు. 1200 మంది గాయపడ్డారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ నిలిచి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. అదే సమయంలో యశ్వంత్ పూర్ రైలు రావడంతో పెద్ద ప్రమాదం జరిగింది. బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో రాత్రి 7 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది.

Show comments