NTV Telugu Site icon

Rajasthan Kota: రాజస్థాన్‌ కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది ఇప్పటికే 15 మంది ఆత్యహత్య చేసుకున్నారు

Rajasthan Kota

Rajasthan Kota

Rajasthan Kota: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కోచింగ్‌ సెంటర్లకు హైదరాబాద్‌ ఎంతటి పేరుగాంచిందో.. అలాగే నీట్‌, జేఈఈ కోచింగ్‌ దేశంలోని రాజస్థాన్‌లోని కోటా కూడా అలాగే బాగా ప్రాచుర్యం పొందింది. కోటాలో నీట్‌, జేఈఈ కోచింగ్‌ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కోటాకు వచ్చి అక్కడే ఉండి నీట్‌, జేఈఈలకు కోచింగ్‌కు తీసుకుంటారు. అయితే ఇక్కడ కోటాకు వచ్చి కోచింగ్‌ తీసుకుంటున్న వారిలో ఈ మధ్య కాలంలో ఒత్తిడిని తట్టుకోలేకనో.. లేకపోతే మరే ఇతర కారణాలో తెలియదు గానీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత నెలలో బీహార్‌ నుంచి వచ్చిన విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా.. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెలలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే గత ఏడాది కోటాలో సుమారు 15 మంది ఆత్మహత్య చేసుకొని మరణించారని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

Read also: Elina Svitolina Pics: అందం టెన్నిస్ ఆడితే ఇలా ఉంటుందా?.. తల్లయినా తగ్గని ఎలినా స్వితోలినా గ్లామర్!

రాజస్థాన్‌లోని కోటాలో 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన విద్యార్థి రెండు నెలల క్రితమే కోటాకు కోచింగ్‌ తీసుకోవడం కోసం వచ్చాడు. ఐఐటీలో సీటు సాధించడం కోసం జేఈఈ కోచింగ్ తీసుకుంటున్నాడని అధికారులు తెలిపారు. రెండు నెలల నుంచి జేఈఈ కోచింగ్‌ క్లాసులకు హాజరవుతున్నట్టు అధికారులు తెలిపారు.
అతను తన స్నేహితుడితో కలిసి కోటలోని పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఉంటున్నాడు. విద్యార్థి తన స్నేహితుడు ఊరికి వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థిని రూమ్‌మేట్ శనివారం ఉదయం తమ గదికి తిరిగి వచ్చి చూడగా తలుపు తాళం వేసి ఉంది. దీంతో అతను ఇరుగుపొరుగు వారికి, పోలీసులకు సమాచారం అందించడంతో వారు గది తలుపులు పగులగొట్టి గదిలో ప్రవేశించారు. గదిలో విద్యార్థి ఉరివేసుకుని మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read also: Bandi Sanjay: వరంగల్‌లో బీజేపీ సభ.. ‘నా మోడీ’ అంటూ బండి ఎమోషనల్ స్పీచ్..

కోటా జాతీయ పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇవ్వడానికి చాలా పేరున్న ప్రాంతం. జాతీయ పోటీ పరీక్షలను ఛేదించడానికి సిద్ధమవుతున్న విద్యార్థులు ఎక్కువ మంది ఇక్కడ హాస్టల్స్ లో ఉంటూ కోచింగ్‌ తీసుకుంటున్నారు. గత ఏడాది కోటాలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని మరణించినట్టు కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ సంఖ్య ఇప్పటికే 15కు చేరిందని చెబుతున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోర్సులలో ప్రవేశం కోసం పోటీ పరీక్షలను ఛేదించడానికి విద్యార్థులకు శిక్షణనిచ్చే ప్రముఖ కోచింగ్ సెంటర్‌లకు కోట ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో కోటాలోని కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కోటా కోచింగ్‌ సెంటర్లలో చేరే ముందు విద్యార్థులు మెడికల్‌, ఇంజినీరింగ్‌ పరీక్షలకు సిద్ధమయ్యారో లేదో తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహించాలని భావిస్తోంది. అలా వివరాలను తీసుకొని కోచింగ్‌ సెంటర్లకు వచ్చిన విద్యార్థుల వివరాలను తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

Show comments