Site icon NTV Telugu

Kulgam Encounter: కుల్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరో ఎన్‌కౌంటర్..

Jammu Kashmir

Jammu Kashmir

Kulgam Encounter: జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ మొదలైంది. కుల్గాం జిల్లాలో మరోసారి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు రోజు ఇదే ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన రెడ్‌వానీ సమీపంలోనే కాల్పులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ అయిన ది రెసిస్టెంట్ ఫ్రంట్‌కి చెందిన కమాండర్ బాసిత్ దార్‌‌తో సహా ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి.

Read Also: SRH vs LSG: రాణించిన బడోనీ, పూరన్.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 166

దార్ సెక్యూరిటీ ఏజెన్సీల ‘‘మోస్ట్ వాంటెడ్ లిస్టు’’లో ఉన్నారు. ఇతనిపై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉంది. పోలీస్ సిబ్బందితో పాటు సాధారణ పౌరులను చంపిన 18 కంటే ఎక్కువ కేసుల్లో ఇతడి ప్రమేయం ఉన్నట్లు కాశ్మీర్ ఐజీ తెలిపారు. హతమైన బాసిత్ దార్‌ని భద్రతా బలగాలు ‘ఏ’ కేటగిరి ఉగ్రవాదిగా పేర్కొన్నారు. లష్కరేకు అనుబంధంగా ఉన్న రెసిస్టెంట్ ఫ్రంట్ ఉగ్రవాదులు కాశ్మీర్‌లో సామాన్యులు, వలస కూలీలు, హిందువులను టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడుతున్నారు.

Exit mobile version