NTV Telugu Site icon

లొంగిపోయిన మరో 14 మంది మావోయిస్టులు

మావోయిస్టులు వరుసగా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. కరోనా ప్రభావం తరువాత మావోయిస్టుల లొంగుబాటులు ఎక్కువయ్యాయి. కానీ ఈ విషయం మావోయిస్టు పార్టీలకు తీవ్ర నష్టాన్ని కలిగించేదే. అయితే ఇటీవల కరోనా బారినపడి మావోయిస్టుల్లో అగ్రనేతలు సైతం మరణించారు. దీంతో మావోయిస్టులు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు.

తాజా మరో 14 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఎస్పీ ముందు లొంగిపోయారు. వీరిలో రూ.లక్ష రివార్డు ఉన్న సన్నా మార్కం కూడా ఉండడం విశేషం. భద్రత సిబ్బందిపై 2017లో సురేందర్‌గఢ్‌ వద్ద దాడి ఘటనలో వీళ్లు నిందితులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. మావోయిస్టులు అడవిని వీడి కుటుంబంతో కలిసి జీవించాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.