BJP: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ వాదనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అలంద్ నియోజకవర్గంతో ఉద్దేశపూర్వకంగా 6000 ఓట్లను తొలగించారని, దీని వెనక కేంద్ర ఎన్నికల సంఘం ఉందని, ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను సామూహికంగా తొలగించారిన ఆరోపించారు. రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్‌లు, ఫోన్ నంబర్లు ఉపయోగించి తొలగిస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేంద్ర మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ విమర్శలను ఖండించారు. ‘‘తన సొంత దేశంలో అణు బాంబులను, హైడ్రోజన్ బాంబులనున వేయడం అనే భావన ఉన్న ప్రపంచంలోని ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ’’ అంటూ ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో మీరు ఏదైనా చెప్పే హక్కు ఉందని, మీ ఉద్దేశం మంచిదైతే మీరు వేరే పరిభాషను ఉపయోగించుకోవచ్చు, కానీ ప్రతికూల ఫలితాలు మిమ్మల్ని చాలా ప్రభావితం చేశాయని, అందుకు మీరు మంచిగా ఆలోచించరు, మంచిగా మాట్లాడరు అని అన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ రోజు చేసిన వ్యాఖ్యలు తక్కువే అని, త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’ రానుందని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వ్యక్తుల్ని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు.‘‘రాహుల్ గాంధీకి రోజురోజుకు నిరాశ పెరుగుతోంది. తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారింది. కోర్టుల ద్వారా మందలించబడటం అతడికి ఒక దినచర్యగా మారింది’’ అని అన్నారు.
