NTV Telugu Site icon

Viral Video: పెళ్లి చేసుకోమని అడిగిన యువతి.. పిచ్చకొట్టుడు కొట్టిన యువకుడు

Madhya Pradesh Viral Video

Madhya Pradesh Viral Video

Viral Video: ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని అడిగిన ఓ యువతిని యువకుడు దారుణంగా చితకబాదాడు. ఆమెను కిందపడేసి బూటు కాళ్లతో పిచ్చకొట్టుడు కొట్టాడు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ గ్రామంలోని రోడ్డుపై యువ జంట నడుచుకుంటూ వెళ్తున్నారు. మాటల సందర్భంలో తనను పెళ్లి చేసుకోవాలని తన వెంట ఉన్న యువకుడిని యువతి కోరింది. దీంతో అతడు తీవ్ర ఆగ్రహం చెందాడు. మొదట ఆ యువతి చెంపపై కొట్టాడు. ఆ తర్వాత ఆమె జుట్టుపట్టి లాగి కిందకు తోసేశాడు. రోడ్డుపై పడిపోయిన ఆమెను తన బూటు కాళ్లతో దారుణంగా కొట్టాడు. ఆమె కాళ్లు, చేతులతోపాటు ముఖంపైనా కాలితో బలంగా తన్నాడు.

Read Also: Okkadu: ట్రైలర్ కట్ అదిరింది… ఘట్టమనేని అభిమానులకి జాతరే

ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. యువతిని యువకుడు విచక్షణారహితంగా కొడుతున్న సమయంలో కొందరు ఈ తతంగాన్ని తమ సెల్‌ఫోన్‌ల సహాయంతో వీడియో తీశారు తప్పితే బాధితురాలిని కాపాడే ప్రయత్నం చేయలేదు. అయితే కొందరు తీసిన వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా కాసేపట్లోనే వైరల్ అయ్యింది. ఈ ఘటన చివరకు రేవా పోలీసుల దృష్టికి ఇది వెళ్లింది. దీంతో పోలీసులు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేశారు. వీడియో క్లిప్‌లోని ఆ జంటను గుర్తించి యువతిపై దాడి చేసిన యువకుడిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Show comments