NTV Telugu Site icon

Anant Ambani Padyatra: అనంత్ అంబానీ 141 కి.మీ పాదయాత్ర.. దేనికోసమంటే..!

Anantambanipadyatra

Anantambanipadyatra

అనంత్ అంబానీ.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు. గతేడాదే అంగరంగ వైభవంగా అనంత్ వివాహం జరిగింది. రాధికా మర్చంట్‌ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులంతా ఈ మ్యారేజ్‌కు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: MEGA – ANIL : మెగా 157.. రఫ్ఫాడించేద్దాం.. ప్రోమో రిలీజ్

అయితే తాజాగా అనంత్ అంబానీ ఆధ్యాత్మిక అవతారం ఎత్తారు. ఇటీవలే ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. తాజాగా ద్వారకాదీష్‌లో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరకు పాదయాత్ర చేపట్టారు. బిగ్గరగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకాకు 141 కిలోమీటర్లు. నిత్యం సెక్యూరిటీ మధ్య 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే సమీప గ్రామస్తులు కూడా ఈ పాద్రయాత్రలో పాల్గోవడం విశేషం.

ఇది కూడా చదవండి: Zelenskyy: ఆస్తులు ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఎంత పెరిగిందంటే..!

ఇదిలా ఉంటే ఏప్రిల్ 10న అనంత్ అంబానీ పుట్టినరోజు. ఆరోజుకి అనంత్ అంబానీ ద్వారకా చేరుకోనున్నారు. శ్రీకష్ణుడి పాదాలకు మ్రొక్కి.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మీడియాతో మాట్లాడుతూ.. తన వల్ల ట్రాఫిక్ జామ్ కాకుడదని రాత్రిపూట పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. భారీ సెక్యూరిటీ మధ్య నడక చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత 5 రోజులుగా పాదయాత్ర సాగుతుందని.. 4 రోజుల్లో ద్వారకా చేరుకుంటానని తెలిపారు. ద్వారకాధీశుడి అందరినీ ఆశీర్వదిస్తాడని అనంత్ అంబానీ చెప్పారు.