NTV Telugu Site icon

ఆనంద్ మహీంద్రా ట్వీట్… ఇదేంటో చెప్పుకోండి చూద్దాం… 

కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవాలంటే గూగుల్ ను సెర్చ్ చేస్తాం.  అయితే, ట్విట్టర్ తో నిత్యం టచ్ లో ఉండే వ్యక్తులు కొత్త విషయాల కోసం ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ అకౌంట్ ను సెర్చ్ చేస్తుంటారు.  కొత్త కొత్త విషయాలతో పాటుగా అప్పుడప్పుడు మెదడకు పదును పెట్టె క్విజ్ లను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటారు.  తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఓ గోళం, దానికి నాలుగు తీగలు ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసి అదేంటో తెలుసా అని ప్రశ్నించాడు.  ఇక నెటిజన్లు వారి మెదడుకు పని చెప్తూ రిప్లైలు ఇవ్వడం మొదలుపెట్టారు.  చాలా వరకు కరెక్ట్ గానే జావాబిచ్చారు.  మనిషి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ వి 1 ఉపగ్రహ చిత్రం అది.  రష్యా ప్రయోగించిన ఈ ఉపగ్రహం విజయవంతం అయ్యింది.  అప్పటి నుంచి రోదసిలో జరిగే అనేక విషయాలను మనిషి తెలుసుకోగలుగుతున్నాడు.