Site icon NTV Telugu

Russia-Ukraine War: ఆనంద్‌ మహీంద్రా కొత్త ప్లాన్..!

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఇప్పుడు అందిరినీ టెన్షన్‌ పెడుతోంది.. ఇది మరింత ముదిరి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అణు యుద్ధం తప్పదా? అనే అనుమాలు కూడా ఉన్నాయి… అయితే, ఈ యుద్ధం కారణంగా చాలా మంది భారతీయులు మరీ ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది… ఇక, ఏ విషయమైనా సోషల్‌ మీడియా వేదికగా స్పందించే భారత ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్ మహీంద్రా.. ఈ యుద్ధ సమయంలో ఓ సరికొత్త ఆలోచన చేశారు. అసలు, ఆ దేశానికి భారత్‌ నుంచి అంత మంది విద్యార్థులు ఎందుకు వెళ్లారు? అక్కడ ఎందుకు చిక్కుకోవాల్సి వచ్చిందన్న కోణంలో ఆలోచన చేసిన ఆయన… మరలా ఇలాంటి పరిస్థితి రాకుండా తన వంతు ప్రయత్నం కూడా చేస్తున్నారనే చెప్పాలి.

Read Also: Chandrababu: వివేకా హత్య కేసుపై వ్యంగ్యాస్త్రాలు

అయితే, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.. వైమానికి దళ విమానాలను కూడా రంగంలోకి దింపింది.. అయితే, వీరంతా ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన వారే కావడం గమనార్హం. మెడిసిన్‌ కోసం చైనా తర్వాత భారత విద్యార్థులు ఎక్కువగా ఆశ్రయిస్తోన్న రెండో దేశం ఉక్రెయిన్‌ అని ఇటీవలే.. కొన్ని కథనాలు స్పష్టం చేస్తున్నాయి.. వాటిపై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. భారత్‌లో వైద్య కళాశాలల కొరత ఉందనే విషయం నాకు తెలియదు.. మహీంద్రా యూనివర్శిటీ క్యాంపస్‌లో మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించొచ్చేమో అంటూ ట్వీట్ చేస్తూ టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నారీని ట్యాగ్‌ చేశారు. ఇక, కష్ట సమయంలో ఆనంద్‌ మహీంద్ర సరికొత్త ఆలోచనలకు ఫిదా అయిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version