NTV Telugu Site icon

Water from air: గాలి నుంచి నీరు తయారు చేస్తున్న భారతీయ సంస్థ.. ఎలా సాధ్యం..?

Atmospheric Water Generators (awgs)

Atmospheric Water Generators (awgs)

Water from air: ప్రపంచాన్ని నీటి కొరత సమస్య వేధిస్తోంది. కొన్ని దేశాల్లో నీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. అయితే, గాలి నుంచి నీటిని తయారు చేసే సాంకేతిక ఒకటి అందుబాటులోకి రాబోతోంది. విషయం ఏంటంటే, భారతీయ కంపెనీ ‘‘అక్వో’’, గాలి నుంచి నీటిని వెలికితీసే ఒక వినూత్న ‘‘అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్లను (AWGs)’’లను డెవలప్ చేసింది. న్యాచురల్ కండెన్సేషన్ ప్రక్రియ ద్వారా, ఈ యంత్రాలు స్వచ్ఛమైన తాగునీటిని ఉత్పత్తి చేస్తాయి. సంప్రదాయ నీటి వనరుల స్థానంలో కొత్త పద్ధతి ద్వారా నీటిని అందిస్తాయి.

ఈ వాటర్ జెనరేటర్స్, ప్రకృతిలో నీటి ఆవిరి ఎలా నీరుగా ఏర్పడుతుందో అదే విధమైన కండెన్సేషన్ సూత్రంపై పనిచేస్తాయి. దమ్ము, మలినాలను తొలగించే మూడు పొరల వడపోత వ్యవస్థ ద్వారా వాతావరణం నుంచి గాలిని లాడగం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా ప్యూరిఫై చేయబడిన గాలిని కండెన్సర్‌లో చల్లబరుస్తారు. తేమ చల్లబడి చిన్నచిన్న నీటి చుక్కలుగా మారుతుంది. తుదిదశలో ఉత్పత్తి అయిన నీరు వినియోగానికి సిద్ధంగా ఉంటుంది.

READ ALSO: RSS: “దారా షికో”ని కాకుండా “ఔరంగజేబు”ని కొలుస్తున్నారు.. వారు దేశానికి ప్రమాదం..

ఈ కొత్త సాంకేతికత వెచ్చని, తేమతో కూడిన వాతావరణం, అంటే 21C నుండి 32C మధ్య ఉష్ణోగ్రతలు మరియు తేమ స్థాయిలు 40% కంటే ఎక్కువగా ఉండే తీరప్రాంతాలలో బాగా పనిచేస్తాయి. తక్కువ తేమ ఉన్న వాతావరణంలో, మా వ్యవస్థలు నీటిని వెలికితీయడానికి అధునాతన కండెన్సర్‌లు, స్మార్ట్ అల్గారిథమ్‌ ఉపయోగిస్తామని అక్వో సీఈఓ నవకరణ్ సింగ్ భగ్గా చెప్పారు.

భూ వాతావరణంలో 3100 క్యూబిక్ మైళ్ల నీటి ఆవిరి ఉంటుందని అంచనా. ఈ వాటర్ జనరేటర్లు ప్రకృతి జలచక్రాన్ని ఉపయోగించుకుని నీటిని తయారు చేస్తాయి. సహజ ప్రక్రియ అయిన భూగర్భ నీటిని వెలికి తీసే డీశాలినేషన్ కాకుండా, వాతావరణం నుంచి నీటిని ఉత్పత్తి చేయడం చాలా మంది ఆలోచనగా చెబుతున్నారు.