NTV Telugu Site icon

TamilNadu: చెన్నైలో తప్పిన విమానం ప్రమాదం.. ల్యాండ్ అవుతుండగా పేలిన టైర్

Tamilnadu

Tamilnadu

తమిళనాడులో  విమాన ప్రమాదం తప్పింది. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ అవుతుండగా టైర్ పేలిపోయింది. దీంతో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది హడలెత్తిపోయారు. మస్కట్ నుంచి 146 మంది ప్రయాణికులతో చెన్నై చేరుకుంది. ల్యాండింగ్ అయ్యే సమయంలో హఠాత్తుగా టైర్ పేలింది. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుగు ప్రయాణాన్ని అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులకు ఆయా హోటళ్లలో బస ఏర్పాటు చేస్తు్న్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు అన్వేషిస్తున్నారు.

Show comments