NTV Telugu Site icon

Milk Prices: మరోసారి పెరిగిన పాల ధరలు.. లీటర్‌కు రూ.2 పెంచిన అమూల్, మదర్ డైరీలు

Amul Milk

Amul Milk

Milk Prices Hiked Again: దేశవ్యాప్తంగా మరోసారి పాలధరలు పెరిగాయి. గత నెలలో జీఎస్టీ కారణంగా పెరిగిన పాలధరలు ప్రస్తుతం మరోసారి సామాన్యులకు భారంగా తయారయ్యాయి. పాల సేకరణ, ఇతర వ్యయాలు పెరిగిపోవడంతో పాల ధరలను పెంచుతున్నట్లు అమూల్, మదర్ డైరీలు వేర్వేరుగా ప్రకటించాయి. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ శక్తి పాల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) తెలియజేసింది. కొత్త ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని జీసీఎంఎంఎఫ్ వివరించింది.

Read Also: Krishnashtami: కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు? ఉట్టి కొట్టడంలో దాగి ఉన్న రహస్యమేంటి?

మరోవైపు మదర్ డైరీకి సంబంధించిన ఫుల్ క్రీమ్ మిల్క్ పాల ప్యాకెట్ ధర రూ.61 కి పెరిగింది. టోన్డ్ పాల ధర రూ.51కి, డబుల్ టోన్డ్ పాల ధర రూ.45కు, టోకుగా ఇచ్చే పాల ధర రూ.48కి పెంచుతున్నట్టు మదర్ డెయిరీ ప్రకటించింది ఆవు పాల ధర లీటరు రూ.53కి చేరింది. బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధర లీటరుకు రూ. 46 నుంచి రూ. 48కి పెంచారు. గత ఐదు నెలల్లో కంపెనీ ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయని.. ముడి పాల సేకరణ ధరలు దాదాపు 10-11 శాతం పెరిగాయని మదర్ డైరీ అధికారులు వివరించారు. అదే విధంగా మేత, దాణా ధర కూడా గణనీయంగా పెరిగిందన్నారు.ఇప్పటికే ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాల్లో పాల ధరలు పెంచామని, మిగతా చోట్ల కొత్త ధరలు అమల్లోకి వస్తాయని మదర్ డైరీ వెల్లడించింది.

Show comments