NTV Telugu Site icon

Amruta Fadnavis: నరేంద్ర మోదీ “భారత జాతిపిత”.. డిప్యూటీ సీఎం భార్య సంచలన వ్యాఖ్యలు

Amruta Fadnavis

Amruta Fadnavis

Amruta Fadnavis termed Prime Minister Narendra Modi as Father of Nation: భారతదేశానికి ఇద్దరు ‘జాతిపిత’ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్. ప్రధాని నరేంద్రమోదీని ‘ఫాదర్ ఆఫ్ నేషన్’గా అభివర్ణించారు. ఈ వారం నాగ్‌పూర్‌లో రచయితల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదికపై ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మహాత్మాగాంధీ ఏమవుతారని ప్రశ్నించగా.. మహాత్మాగాంధీ ‘జాతిపిత’ అని.. ప్రధాని నరేంద్ర మోదీ నవ భారదేశానికి జాతిపిత అంటూ వ్యాఖ్యానించారు. ఈ దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని అన్నారు.

Read Also: Raviteja: రవితేజ నోటి దూల.. ఆ డైరెక్టర్ ను కల్లు తాగిన కోతి అంటూ

గతంలో కూడా అమృత ఫడ్నవీస్ ఇలాగే ప్రధాని నరేంద్ర మోదీని జాతిపితగా పలిచింది. 2019లో ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ..‘‘ మన దేశ జాతిపిత నరేంద్రమోదీకి జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము’’ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అమృత ఫడ్నవీస్. గతంలో శివసేన నేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఉద్దేశించి కూడా వివాదాస్పద ట్వీట్ చేశారు. ఏక్ ‘థా’ కపాటి రాజా( ఒకానొకప్పుడు చెడ్డ రాజు ఉండేవాడు) అని ట్వీట్ చేసి.. ఆ తరువాత తొలగించింది. ‘థా’ను హైలెట్ చేస్తూ ట్వీట్ చేయడం చూస్తే.. ఆమె థాకరేని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.

గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ ప్రభుత్వ కుప్పకూలింది. ఆ తరువాత ఏక్ నాథ్ షిండే సీఎంగా.. దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.