కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన కుమారుడైన బీసీసీఐ సెక్రటరీ జై షాపై సీరియస్ అయ్యారు… ఇటీవల, ఒక వీడియో చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది.. తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైరల్ అయిన ఆ వీడియోలో హోంమంత్రి అమిత్ షా తన కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేస్తున్నట్టు ఉన్న దృశ్యాన్ని చూడవచ్చు. అమిత్‌షా పక్కనే నిలబడిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీ జై షాను కూడా మీరు చూడవచ్చు. అయితే, ఓ వైపు పూజ జరుగుతుంటే.. ఆ సమయంలో తన దృష్టిని అక్కడ కేంద్రీకరించకుండా.. దిక్కులు చూస్తున్నారు జై షా.. దీంతో.. కుమారుడిపై కాస్త అసహనం వ్యక్తం చేసిన ఆయన.. “ఆమా ధ్యాన్ దే” (దీనిపై దృష్టి పెట్టు)” అంటే పూజా కార్యక్రమంపై దృష్టిసారించాలని అమిత్ షా తన కుమారుడు జై షాను గద్దించారు.. ఆ వీడియో వైరల్ గా మారిపోయింది.. తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్… వేలల్లో లైక్‌లు పొందింది.. ఎంతైనా.. బీసీసీఐ కార్యదర్శి అయినా.. ఓ తండ్రి కుమారుడేగా.. తండ్రి పక్కనుండగా దిక్కులు చూస్తే అలాగే ఉంటుంది మరి అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
Read Also: KCR Special Flight: కేసీఆర్ దూకుడు.. జాతీయ పార్టీ..! సొంత విమానం..!