NTV Telugu Site icon

MBBS in Hindi: హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించిన అమిత్ షా.

Mbbs In Hindi

Mbbs In Hindi

Amit Shah started MBBS course in Hindi language: దేశ విద్యా వ్యవస్థలో చారిత్రక ఘట్టం మొదలైంది. తొలిసారిగా వైద్యవిద్యను హిందీ మాధ్యమంలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్ భోపాల్ లో హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. ప్రధాని మోదీ కోరిక నెరవేరిందని ఆయన అన్నారు. భారతదేశ విద్యా రంగంలో ఇది కీలకమైన రోజని అమిత్ షా అన్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజుగా దీన్ని అభివర్ణించారు. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో ప్రారంభించడాన్ని చారిత్మాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. హిందీ ఎంబీబీఎస్ కోర్సు పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు.

మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందగలిగే పేద పిల్లల జీవితాల్లో ఈ రోజు అమిత్ షా కొత్త ఉదయాన్ని తీసుకువచ్చారని.. ఇన్నాళ్లు వాళ్లంతా ఇంగ్లీష్ వలయంలో చిక్కుకున్నారని సీఎం శివరాజ్ సింగ్ అన్నారు. చాలా సార్లు విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక చదువును వదిలేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, విద్యాశాఖ మంత్రి విశ్వస్ కైలాస్ సారంగ్ పాల్గొన్నారు.

Read Also: TS Group 1 Exam : 45 రోజుల పసిపాపతో గ్రూప్‌ 1 పరీక్షకు ఓ మహిళ.. తల్లి పరీక్ష రాస్తుంటే.. పాప ఆకలితో ఏడుస్తూ..

అంతకుముందు సీఎం శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మనం ఎందుకు ఇంగ్లీషు భాషకు బానిసలుగా ఉండాలని.. ప్రశ్నించారు. చైనీస్, జపనీస్, జర్మన్లు, ఫ్రెంచ్ వారు తమ భాషల్లోనే చదివి తమ ప్రతిభ చాటుకోగలిగితే.. మన పిల్లలు ఎందుకు అలా చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇంగ్లీషులో చదువుకోవాలంటే చదువుకోవచ్చని బలవంతం ఏం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 6 ఇంజనీరింగ్, 6 పాలిటెక్నిక్ కాలేజీల్లో హిందీని విద్యను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐఐటీ, ఐఐఎం హిందీ విద్యను ప్రారంభించాలనేది మా కల అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

మధ్యప్రదేశ్ సిద్ధం చేసిన హిందీ పుస్తకాలను ఇతర రాష్ట్రాలతో పంచుకుంటానమ.. ఈ విషయమై అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం అవుతామని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో చదవని, ఇంగ్లీష్ పరిజ్ఞానం లేని కారణంగా చాలా మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోలేకపోతున్నారని.. వారి కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్ ను హిందీలో ప్రారంభిస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.