Site icon NTV Telugu

Amit Shah: మోడీ తల్లిని తిట్టినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే..

Amit Shah

Amit Shah

Amit Shah: బీహార్ ​లో ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఇండియా కూటమి నేతలు చేసిన వివాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. యాత్ర సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు అనుచిత పదజాలాన్ని వాడటం దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also: Samsung Galaxy A17 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. మిడ్ రేంజ్ లో సామ్ సంగ్ గెలాక్సీ ఏ17 5G రిలీజ్

అమిత్‌ షా మాట్లాడుతూ.. మోడీ జీతో పాటు ఆయన తల్లికి, ఈ దేశ ప్రజలందరికీ కాంగ్రెస్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ తల్లి పేద కుటుంబంలో తన పిల్లలను విలువలతో పెంచి, ఈ దేశానికి గొప్ప నాయకుడిని ఇచ్చారు.. అలాంటి వ్యక్తిని దూషించడం హిందుస్థాన్ ప్రజలు ఎప్పటికీ సహించరు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో ద్వేషపూరితమైన సంస్కృతిని వ్యాప్తి చేస్తోంది అన్నారు. “కాంగ్రెస్‌ ఎంత ఎక్కువ దూషిస్తే, బీజేపీ అన్ని ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందన్నారు. అలాగే, రాహుల్‌ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని అమిత్ షా ఆరోపించారు. మరోవైపు, ప్రధాని మోడీ, ఆయన తల్లిని దూషించిన బీహార్ కి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version