Site icon NTV Telugu

Amit Shah: మావోల ఏరివేతలో చారిత్రాత్మక విజయం సాధించాం

Amitshah

Amitshah

మావోయిస్టుల ఏరివేతలో చారిత్రాత్మక విజయం సాధించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో నిర్వహించిన ‘‘ఆపరేషన్ బ్లాక్‌ఫారెస్ట్‌’’లో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చడంపై ఎక్స్ ట్విట్టర్ వేదికగా అమిత్ షా స్పందించారు. కర్రెగుట్టలు ఒకప్పుడు మావోల రాజ్యంగా ఉండేవని, ఇప్పుడు మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని తెలిపారు. 21 రోజుల్లోనే భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని ప్రశంసించారు. 2026 మార్చి కల్లా నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఇది కూడా చదవండి: Boycott Turkey: జేఎన్‌యూ ఝలక్.. టర్కీ వర్సిటీతో ఒప్పందం రద్దు

ఒకప్పుడు కర్రెగుట్టలు మావోలకు నిలయంగా ఉండేది. వ్యూహాలు, ఫైటర్లకు శిక్షణా కేంద్రంగా ఉండేది. అలాంటి కర్రెగుట్టలో 21 రోజుల పాటు భద్రతా బలగాలు అతిపెద్ద ఆపరేషన్ చేపట్టి విజయం సాధించాయి. బలగాలను చూస్తుంటే సంతోషంగా ఉందని.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని అమిత్ షా ప్రశంసించారు. మావోయిస్టులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని పోరాడిన సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, ఛత్తీస్‌గఢ్‌ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్‌లకు అభినందనలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: Nithin : అప్పుడు రాబిన్ హుడ్.. ఇప్పుడు తమ్ముడు.. నితిన్ త్యాగాలు..!

 

Exit mobile version