Site icon NTV Telugu

దూకుడు పెంచిన ఆప్‌: నిన్న పంజాబ్ నేడు గోవా…

ఢిల్లీతో పాటు చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల్లో విస్త‌రించేందుకు ఆమ్ అద్మీ పార్టీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  పంజాబ్‌లో గ‌త ఎన్నిక‌ల్లో కొన్ని స్థానాల్లో విజయం సాధించిన ఆప్ ఎలాగైనా పంజాబ్ అసెంబ్లీని సొంతం చేసుకోవాల‌ని ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ది.  ప్ర‌జ‌లు కోరుకున్న అభ్య‌ర్థిని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా నిల‌బెట్టింది.  కాగా, ఇప్పుడు గోవా పై దృష్టి సారించింది ఆ పార్టీ.  ఆ పార్టీ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ గోవా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు.  న్యాయ‌వాది, సామాజిక కార్య‌క‌ర్త అమిత్ పాలేక‌ర్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు.  అమిత్ పాలేక‌ర్ ఓబీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన బండారీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి.  

Read: కోవిడ్ టెర్ర‌ర్‌: ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు…

గోవాలో 35 శాతం మంది జ‌నాబా ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తులే ఉన్నారు. గోవాలో చారిత్రాత్మ‌క క‌ట్ట‌డాల‌ను కూల్చివేసిన స‌మ‌యంలో పాలేక‌ర్ నిర‌స‌న దీక్ష‌లు చేప‌ట్టారు.  గతేడాది అక్టోబ‌ర్‌లో పాలేక‌ర్ ఆప్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే.  40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి పిబ్ర‌వ‌రి 14 వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  మార్చి 10 వ తేదీన ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.  

Exit mobile version