Amazon: భారత్, కెనడాల్లో అమెజాన్ రిటర్న్ పాలసీ మధ్య వ్యత్యాసాల గురించి ఓ భారతీయ యువతి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘అమెజాన్ ఇండియా వర్సెస్ కెనడా’ టైటిల్‌తో డాక్టర్ సెలీన్ ఖోస్లా చేసిన వీడియో వైరలైంది. కెనడాలో అమెజాన్ పార్శిల్ రిటర్న్ ఇచ్చేటప్పుడు తాను ఎదుర్కొన్న అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు. ‘‘విపరీతమైన ఉష్ణోగ్రతల్లో కూడా రిటర్న్ తీసుకుంటున్న భారత్‌లోనీ ప్రతీ డెలివరీ అసోసియేట్‌కి గొప్ప గౌరవం ఇస్తు్న్నాను’’ అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
కెనడాలో కస్టమర్లు ప్రోడక్ట్‌ని రిటర్న్ ఇవ్వాలంటే, ప్రొడక్ట్ ప్యాక్ చేయాలని, రిటర్న్ లేబుల్ ప్రింట్ చేసి, ప్యాకేజీని పోస్టాఫీసుకు తీసుకెళ్లాలని ఆమె చెప్పింది. భారతదేశంలోని రిటర్న్ సేవలపై ఆమె ప్రశంసలు కురిపించారు. రిటర్న్ బటన్‌పై ఒక్క క్లిక్ చేస్తే డెలివలరీ చేసే వ్యక్తి లేదా ‘‘ అమెజాన్ వాలే భయ్యా’’ పార్శిల్ తీసుకునేందుకు కస్టమర్ ఇంటికే వస్తారని, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా సేవల్ని అందిస్తారని ఆమె చెప్పింది.
Read Also: Prajwal Revanna: ఇండియాకు రావడానికి ముందే ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్..
కెనడాలో మాత్రం పార్శిల్ రిటర్న్ ఇవ్వడానికి పోస్టాఫీస్ వెళ్లాలని, భారతీయ పోస్టాఫీసుల్లో పనిచేసే వ్యక్తులు కూడా పోస్టాఫీసు వెళ్లరని ఆమె చెప్పింది. అయితే, కెనడాలో మాత్రం అందరూ పోస్టాఫీసు వెళ్తారు, ఎందుకంటే అమెజాన్ రిటర్న్ వస్తుందని సెటైర్లు వేవారు. గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించి పోస్ట్ ఆఫీసుని నావిగేట్ చేయడంలో ఉన్న సవాళ్లను కూడా ఆమె ప్రస్తావించింది. తాను వెళ్లిన మొదటి పోస్టాఫీసు లొకేషన్ మూసి ఉందని, చివరకు సరైన లొకేషన్ కనుగొన్నానని చెప్పారు.
భారతదేశంలో ఈ ప్రక్రియ ఎంత సౌకర్యవంతంగా ఉందనే విషయాన్ని అక్కడి పోస్టల్ ఉద్యోగితో పంచుకున్నానని చెప్పారు. ‘‘మీరు షాంపూ బాటిల్ ఆర్డర్ చేసినా, వారు వచ్చి తీసుకుంటారు, ఎందుకంటే మేమే డెవలప్ అయ్యాము, మేము మా విశేషాధికారం కలిగి ఉన్నాం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను’’ అంటూ ఖోస్లా అన్నారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. ‘‘భారత్ నివసించడానికి ఉత్తమమైన దేశం’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, ‘‘భారతదేశం లాంటి ప్రదేశం లేదు’’ అని మరొకరు అన్నారు. ఎన్నారైలు మరియు విదేశీ విద్యార్థులకు మాత్రమే “భారతదేశం యొక్క నిజమైన విలువ తెలుసు” అని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియో సేవా ప్రమాణాల్లో ఇరు దేశాల మధ్య వ్యత్యాసాలు, సౌకర్యాలపై విస్తృత చర్చకు దారి తీసింది.
