Site icon NTV Telugu

అమెజాన్ కీలక నిర్ణయం… ప్రైమ్ డే సేల్ వాయిదా 

కరోనా దేశంలో విజృంభిస్తోంది.  దీంతో ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు.  ఎక్కడి వ్యక్తులు అక్కడే ఇంటికి పరిమితం అయ్యారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వ్యాపార రంగాలు చాలా వరకు కుదేలవయ్యాయి.  విలువైన వస్తువుల జోలికి వెళ్లకుండా ఆరోగ్యంపైనే ప్రజలు దృష్టి సారించారు.  ఇక ఇదిలా ఉంటె, ఈ కామర్స్ దిగ్గజం ఈ నెలలో నిర్వహించాల్సిన ప్రైమ్ డే సేల్ ను వాయిదా వేసింది.  ప్రతి ఏటా మే నెలలో ఈ సేల్ ను నిర్వహిస్తుంది.  కరోనా కారణంగా గతేడాది ఆగష్టు నెలలో ఈ సేల్ ను నిర్వహించింది.  ఇప్పుడు సెకండ్ వేవ్ ఉదృతి ఉండటంతో ఈనెల జరగాల్సిన సేల్స్ ను వాయిదా వేసింది. 

Exit mobile version