NTV Telugu Site icon

Allahabad High Court: అరెస్ట్‌కి కారణం తెలియజేయకపోవడం, బెయిల్ ఇవ్వడానికి కారణం అవుతుంది..

Allahabad Hc

Allahabad Hc

Allahabad High Court: అరెస్ట్ చేయడానికి గత కారణాలను నిందితులకు సరిగా తెలియజేయాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు గల కారణాన్ని తెలియజేయడం తప్పనిసరి అవసరం అవసరమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. చట్టబద్ధమైన పరిమితులు ఉన్నప్పటికీ, కారణాలు తెలియజేయకపోతే బెయిల్ మంజూరు చేయడానికి ఒక కారణం అవుతుందని కోర్టు తీర్పు చెప్పింది.

Read Also: Crime: పిల్లల ముందే భార్యని క్రూరంగా కొట్టి చంపిన కసాయి..

ఒక కేసులో నిందితుడి అరెస్ట్‌కి గల కారణాలను అతడికి చెప్పలేదని, రాంపూర్‌లోని ఒక మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ‘‘ఆర్టికల్ 22(1) ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించబడినప్పుడు, నిందితుడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించడం కోర్టు విధి. బెయిల్ మంజూరుపై చట్టబద్ధమైన పరిమితులు ఉన్నప్పటికీ, బెయిల్ మంజూరు చేయడానికి అది ఒక కారణం అవుతుంది’’ అని న్యాయమూర్తులు మహేష్ చంద్ర త్రిపాఠి, ప్రశాంత్ కుమార్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ పేర్కొంది.

అరెస్టుకు గల కారణాలను గురించి సమాచారాన్ని అరెస్ట్ చేయబడిన వ్యక్తికి అందించాలి, అరెస్ట్ చేయబడిని వ్యక్తికి అర్థమయ్యే భాషలో వాస్తవాలను తెలియజేయాలి అని మంజీత్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.