All Supreme Court Benches To Hear 10 Matrimonial Cases, 10 Bail Pleas Each Day: వివాహ వివాదాలకు సంబంధించిన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 3000 మ్యాట్రిమోనల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటిని విడతల వారీగా తగ్గించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రతీ రోజూ సుప్రీంకోర్టు అన్ని బెంచ్‌లు 10 మ్యాట్రిమోనియల్ కేసుల బదిలీ పిటిషన్లు, 10 బెయిల్ పిటిషన్లను విచారించనున్నాయి. కొన్ని కేసుల్లో పార్టీలు తమకు నచ్చిన ప్రదేశానికి కేసులను బదిలీ చేయాలని కోరుతున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెల్లడించారు.
Read Also: Delhi: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ సీఎం.. ఆఫీసుకు తాళం వేయాల్సిందిగా ఆదేశాలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంతా కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ప్రతీ బెంచ్ కూడా 10 బదిలీ పిటీషన్లను చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా రోజుకు 10 బెయిల్ విచారణలను శీతాకాల సెలవులకు ముందుగా పరిష్కరించాలని సీజేఐ తెలిపారు. బెయిల్ మంజూరులో వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ప్రతీ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీజేఐ అన్నారు.
సుప్రీంకోర్టులో ప్రస్తుతం 3000 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసుల్లో పార్టీలు తమకు నచ్చిన ప్రదేశానికి కేసులను బదిలీ చేయాలని కోరుతున్నాయని.. ప్రతీ బెంచ్ కూడా ప్రతీ రోజు 10 బదిలీ పిటిషన్లను విచారిస్తే , 13 బెంచ్ లు రోజుకు 130 కేసులు వారానికి 650 కేసులను పరిష్కరించగలవు. కాబట్టి ఐదువారాల్లో శీతాకాల సెలవులకు ముందు అన్ని బదిలీ పిటిషన్లను మూసేస్తామని.. ప్రతీరోజు 20 బదిలీ కేసులు, బెయిల్ కేసులను డీల్ చేసిన తర్వాతే బెంచ్ లు రెగ్యులర్ కేసులను విచారిస్తాయని సీజేఐ వెల్లడించారు.
