Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Akhilesh Yadav Sparks Row Comparing Diwali To Christmas Vhp Slams Remarks

Akhilesh Yadav: ‘‘దీపాలు, క్యాండిల్స్‌పై డబ్బు వృథా చేయొద్దు’’.. దీపావళి వేళ క్రిస్మస్‌పై అఖిలేష్ పొగడ్తలు..

Published Date :October 19, 2025 , 9:31 am
By Venu Goapl Reddy
  • దీపావళి వేళ అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
  • దీపాలు, క్యాండిల్స్‌పై డబ్బు వృథా చేయద్దని కామెంట్స్..
  • ఆగ్రహం వ్యక్తం చేసిన వీహెచ్‌పీ..
Akhilesh Yadav: ‘‘దీపాలు, క్యాండిల్స్‌పై డబ్బు వృథా చేయొద్దు’’.. దీపావళి వేళ క్రిస్మస్‌పై అఖిలేష్ పొగడ్తలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక సభలో ప్రసంగిస్తూ.. ‘‘నేను మీకు ఒక సూచన ఇవ్వాలనుకోవడం లేదు, కానీ నేను రాముడి పేరు మీద ఒక సూచన ఇస్తాను. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సందర్భంగా అన్ని నగరాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ఆ లైట్లు నెలల తరబడి ఉంటాయి. దీపాలు, కొవ్వత్తుల కోసం డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారు.? ఈ ప్రభుత్వం నుంచి మనం ఏం ఆశించవచ్చు, ప్రభుత్వాన్ని దింపేయాలి. మరిన్ని అందమైన లైట్లు ఉండేలా చూసుకుంటాము’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. అయోధ్యలో లక్షల సంఖ్యలో దీపాలు వెలిగించడంపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

దీనిపై విశ్వ హిందూ పరిషత్ (VHP) తీవ్రంగా స్పందించింది. జాతీయ ప్రతినిధి వినోద్ బన్సల్ మాట్లాడుతూ.. ‘‘అఖిలేష్ యాదవ్ దీపావళి సమయంలో క్రిస్మస్ పండగను ప్రశంసిస్తున్నారు. దీపాలు అతడి హృదయాన్ని కాల్చేస్తున్నాయి, అతను వందకోట్ల మంది హిందువులు దీపాలు, కొవ్వొత్తుల కోసం డబ్బు వృథా చేయవద్దని, కిస్మస్ నుంచి నేర్చుకోవాలని చెబుతున్నాడు’’ అని విమర్శించారు. అఖిలేష్ హిందువు కన్నా క్రైస్తవుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. భారతీయ సంస్కృతిపై దాడి చేస్తున్నారని అన్నారు.

Also Read

  • Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
  • West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
  • TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
  • USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..

Read Also: AUS vs IND: ఆస్ట్రేలియాతో భారత్ మొదటి వన్డే.. గంభీర్‌కు ఇష్టమైన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత!

‘‘క్రైస్తవ మతం లేనప్పుడు, దీపావళి సంప్రదాయాలతో జరుపుకునే వారు. ఇప్పుడు, అఖిలేష్ హిందూ సమాజం క్రైస్తవుల నుంచి నేర్చుకోవాలని చెబుతున్నాడు. రాముడు, కృష్ణుడు ఉన్న యూపీ లాంటి పవిత్ర భూమిపై, మాజీ సీఎం తన క్యాబినెట్‌ను నేరస్తులు, తీవ్రవాదులతో నింపాడు. ఆయన నాయకత్వంలోనే అక్రమ మతమార్పుడులు జరిగాయి’’ అని తీవ్రంగా విమర్శించారు.

అఖిలేష్‌కు రెండు నెలల దూరంలో ఉన్న విదేశీ క్రిస్మస్ పండగ ఇప్పుడే వచ్చినట్లు అనిపిస్తోందని, రెండు రోజుల దూరంలో ఉన్న దీపావళి కనిపించడం లేదని వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయోధ్య ప్రకాశవంతంగా వెలిగిపోవడం, హిందువుల ఆనందం పట్ల అసూయ సరైందని కాదని, అందుకే ఆయన పార్టీని అసమాజ్ వాదీ పార్టీగా పిలుస్తారు అని తీవ్రంగా విమర్శించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhilesh Yadav
  • Ayodhya Celebrations
  • Diwali controversy
  • Diwali vs Christmas
  • indian festivals

తాజావార్తలు

  • Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..

  • Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!

  • West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..

  • TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి

  • Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions