Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- సీట్ల పంపకంపై కొనసాగుతున్న SP-కాంగ్రెస్ చర్చలు
- సీట్ల సంఖ్య కంటే కూటమి గెలుపే ముఖ్యమన్న అఖిలేష్
- ‘ఇది సీట్ల గురించి కాదు.. విజయం గురించే’ అంటూ స్పష్టీకరణ
- మిత్రపక్షాలు కలిసి పనిచేయాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్సీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ ఉద్రిక్తంగా మారింది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉంటే, తమకు కనీసం 150 సీట్లు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. మరోవైపు అన్ని సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ సుముఖంగా లేదు. కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా ఎక్కువే అని ఎస్పీ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌కు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కాయి.? ఏ సీటు ఎవరికి కేటాయించారన్న దాని కన్నా కూటమి గెలుపే ప్రధాన లక్ష్యం కావాలని ఆయన అన్నారు. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు మనం చేయి చేయి కలిపి ముందుకు సాగుతాం. ‘‘గమ్యంపై దృష్టి ఉంటే ప్రయాణం సులభం అవుతుంది’’ ఆయన అన్నారు. ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి అని అఖిలేష్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
సీట్ల పంపకాల్లో ‘‘గెలిచే సామర్థ్యాన్ని’’ మరోసారి తన వైఖరిగా ఎస్పీ చీఫ్ స్పష్టం చేశారు. ఏ సీటులో ఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటే వారికే ఆ సీటు కేటాయించాలని ఆయన సూచించారు. బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఆయన.. మతతత్వం మళ్లీ తలెత్తకుండా నిరోధించడం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రిజర్వేషన్లపై బీజేపీ దాడిని అడ్డుకోవడమే ఈ పోరాటం లక్ష్యమని చెప్పారు.
मक़सद जब साफ़ हो तो हाथ-में-हाथ होता है
निगाह मंज़िल पर हो तो सफ़र आसान होता है!बात बड़ी ये नहीं है कि गठबंधन में कितनी सीटें या कौन सी सीट किसके पास जा रही है बात बड़ी ये है कि हम सबको ये सुनिश्चित करना है कि जीत गठबंधन की हो।
फिर दोहराते हैं : बात सीट की नहीं जीत की है।
ये जीत हमारे गठबंधन के दलों से बढ़कर हम सबकी उस संयुक्त कोशिश की जीत होगी जो इसलिए लगातार संघर्षरत है कि साम्प्रदायिकता फिर कभी सिर न उठा सके और लोकतंत्र-संविधान-आरक्षण पर भाजपाई आंच न आए और देश का सौहार्द फिर से खिलखिलाए, देश की तरक़्क़ी और ख़ुशहाली फिर से मुस्कुराए।
जय संविधान-जय हिंदुस्तान!
— Akhilesh Yadav (@yadavakhilesh) October 4, 2026
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!