ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల ‘ఉచిత’ హామీల పర్వం కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలోనే తాజాగా సమాజ్‌వాదీ పార్టీ సైతం గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ హామీతో ముందుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితమని ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం ప్రకటించారు.
Read Also:ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల
లక్నోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అఖిలేష్ ప్రసంగిస్తూ, ఇళ్లకు 300 యూనిట్ల వరకూ కరెంట్ ఉచితమని, రైతులకు సైతం ఇరిగేషన్ కోసం ఉచితంగా విద్యుత్‌ను ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ సైతం త్వరలో జరుగనున్న గోవా, అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత విద్యుత్ హామీని ఇప్పటికే ప్రకటించింది. కాగా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆయా పార్టీలు తమదైన రీతిలో హామీలను ఇస్తు ముందుకు వెళ్తున్నాయి. ఈ సారి యూపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.
