NTV Telugu Site icon

INDIA bloc: యూపీలో 11 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకారం.. కాంగ్రెస్ అసంతృప్తి..

Akhilesh Yadav

Akhilesh Yadav

INDIA bloc: వరసగా ఇండియా కూటమిలో అసంతృప్తులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మమతా బెనర్జీ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెప్పారు. మరోవైపు ఆప్ కూడా పంబాబ్, ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది. ఇక బీహార రాజకీయాలు ఇండియా కూటమి ఉంటుందా..? ఉండదా..? అనే సందేశాలను లేవనెత్తింది. సీఎం నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీకి, కాంగ్రెస్ పార్టీకలు చేయిచ్చి బీజేపీతో కలవబోతున్నారు.

Read Also: Driverless Train: దేశంలో తొలి డ్రెవర్ లెస్ మెట్రో రైల్.. బెంగళూర్‌లో ప్రారంభం..

ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్ వాదీ(ఎస్పీ)ల మధ్య సీట్ల షేరింగ్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం తెలిపారు. అయితే ఈ ఫార్ములాకు కాంగ్రెస్ అంగీకరించలేదని సమాచారం. ‘‘కాంగ్రెస్‌తో మా స్నేహపూర్వక కూటమి 11 బలమైన సీట్లతో శుభారంభం.. ఇండియా కూటమి, పీడీఏ వ్యూహం చరిత్రను మారుస్తుందని’’ ఆయన అన్నారు.

ఈ డీల్‌కి యూపీ కాంగ్రెస్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇది అఖిలేష్ యాదవ్ నిర్ణయమని, ఇది కాంగ్రెస్ నిర్ణయం కాదని చెప్పింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు యూపీ అత్యంత కీలకం. ఈ రాష్ట్రంలో అత్యధికంగా 80 స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు అప్నాదళ్(ఎస్) 62 సీట్లను గెలుచుకోగా.. ఎస్పీ, బీఎస్పీలు కలిసి 15 సీట్లను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఒక్క స్థానంలో సరిపెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అయితే, ఇది కేవలం ఒక ప్రతిపాదన అని, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవగలిగే అభ్యర్థుల గురించి తెలిపితే సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎస్పీ చెప్పింది.