Site icon NTV Telugu

Tamilnadu: ‘‘ అధికార మత్తు.. రాష్ట్రమే సొంత పౌరుడిని చంపింది’’.. లాకప్ డెత్‌పై హైకోర్టు ఆగ్రహం..

Tamilnadu

Tamilnadu

Tamilnadu: 27 ఏళ్ల ఆలయ గార్డు కస్టడీలో మరణించిన ఘటన తమిళనాడును కుదిపేస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలకు కారణమయ్యాయి. ఇదిలా ఉంటే, కస్టడీలో ఒక వ్యక్తి చనిపోవడంపై మద్రాస్ హైకోర్టు విచారించింది. హైకోర్టు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. జూన్ 27న ఒక ఆలయం నుంచి ఆభరణాలను దొంగలించాడనే కేసులో అరెస్ట్ కాబడిన అజిత్ కుమార్‌పై ‘‘ అధికార మత్తులో ఉన్న పోలీసులు’’ దారుణంగా దాడి చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూలై 8 తేదిలోగా పూర్తి స్దాయి నివేదిక ఇవ్వాలని మధురై జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం ఐదుగురు పోలీస్ సిబ్బందిని అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేసింది, డీఎస్పీని సస్పెండ్ చేయడంతో పాటు, ఎస్పీని బదిలీ చేసింది. ఈ చర్యలు సరిపోవని హైకోర్టు చెప్పింది

తమిళనాడు పోలీసులు చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని క్రూరమైన సంఘటనగా అభివర్ణించింది, రాష్ట్ర ప్రభుత్వమే సొంత పౌరుడిని చంపేసిందని పోలీసులపై హైకోర్టు విరుచుకుపడింది. “శరీరంపై 44 గాయాలు కనిపించడం దిగ్భ్రాంతికరం. అతని శరీరంలోని అన్ని భాగాలపై దాడి జరిగింది” అని పోస్టుమార్టం నివేదికను చూపిస్తూ జస్టిన్ ఎస్ఎం సుబ్రమణ్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అజిత్ వీపు, నోరు, చెవులపై కారం పొడి ఉంది’’ అని కోర్టు గమనించింది. పోలీసులు కలిసి ఈ క్రూరమైన చర్యకు పాల్పడ్డాడరని పేర్కొంది.

READ ALSO: Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై రిపోర్ట్ సిద్ధం.. కారణాలు తెలిసే అవకాశం..

తరుచూ సామాజిక పురోగతిలో తమిళనాడు ముందుంది అని చెప్పే ప్రభుత్వ వాదనను విమర్శిస్తూ.. ‘‘అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న కొన్ని ఉత్తర భారత రాష్ట్రాలలో ఇలాంటివి జరగవు. మేము ప్రతిదానికీ మార్గదర్శకులమని ప్రభుత్వం చెబుతున్న తమిళనాడు రాష్ట్రంలో, ఇలాంటి సంఘటన జరగడానికి మీరు ఎలా అనుమతించగలరు?” అని హైకోర్టు ప్రశ్నించింది. విద్యాపరంగా అభివృద్ధి చెందిన తమిళనాడులో ఇలాంటి ఘటనలు ప్రమాదకరం, ఇది ఏ పోలీస్ స్టేషన్‌లో ఎప్పుడూ జరగకూడదు అని హైకోర్టు అంది. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువగా లేదని కోర్టు రాష్ట్రానికి గుర్తు చేసింది: “ప్రజలు దీనిని చూస్తున్నారు. జయరాజ్, బెనిక్స్ కేసును ఎవరూ మర్చిపోలేదు.” అని చెప్పింది.

అతడి శరీరంపై దారుణమైన గాయాలు ఉన్నాయి, అతను వెంటనే మరణించాడు అని న్యాయమూర్తి అన్నారు. ఒక సాధారణ హంతకుడికి కూడా ఇలాంటి గాయాలను చేయడు అని పోలీసులపై హైకోర్టు ధ్వజమెత్తింది. అజిత్ మరణించే వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం, కేసును నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు బృందంలో సీనియర్ అధికారులు లేకపోవడం, అజిత్‌ను కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదేశం నుండి రక్తం మరియు మూత్ర మరకలు సహా సకాలంలో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ లేకపోవడం వంటి అనేక లోపాలను కోర్టు ప్రశ్నించింది.

Read Also: Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై రిపోర్ట్ సిద్ధం.. కారణాలు తెలిసే అవకాశం..

ఆధారాలు సేకరించకుండా ఏం చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అజిత్ తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు ఎందుకు నమోదు చేయలేదని జస్టిస్ సుబ్రమణ్యం ప్రశ్నించారు. అజిత్ సోదరుడికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించడానికి మరియు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఒక వివాహ మండపంలో ఎందుకు చర్చలు జరిగాయని ప్రశ్నించారు. అజిత్‌పై దాడి జరిగిందని ఆరోపిస్తున్న బాత్రూమ్ నుంచి తీసిన వీడియో ఆధారాల గురించి కోర్టు అడిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ..? పోలీసుల చర్యలు ప్రశ్నార్థకంగా ఉన్నందున సీసీటీవీ ఫులేజీని సాక్ష్యంగా తీసుకోవచ్చు, సాక్ష్యాలను నావనం చేసే అవకాశం ఉంది’’ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీస్ స్టేషన్, ఆలయంతో సహా కేసుకు సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజులు భద్రపరచాలని, వాటిని ఏ విధంగా తారుమారు చేయకూడదని కోర్టు ఆదేశించింది. రేపటిలోగా విచారణ న్యాయమూర్తికి ఆధారాలు అందించాలని జస్టిస్ సుబ్రమణ్యం హెచ్చరించారు.

Exit mobile version