బారామతి విమాన ప్రమాదం తర్వాత మహిళా పైలట్ల గురించి అజిత్ పవార్ గతంలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అజిత్ పవార్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
జనవరి 18, 2024న అజిత్ పవార్ ఒక పోస్ట్‌లో… ‘‘విమానం సజావుగా ల్యాండ్ అయినప్పుడల్లా పైలట్ సీటులో ఒక మహిళ ఉంటుంది. మనం హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు మన విమానం లేదా హెలికాప్టర్ సజావుగా ల్యాండ్ అయితే.. పైలట్ ఒక మహిళ అని మనం అర్థం చేసుకుంటాం. #NCPWomenPower.’’ అని అజిత్ పవార్ రాసుకొచ్చారు.
అజిత్ పవార్ పోస్ట్ చేయగానే ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆన్‌లైన్‌లో ప్రశంసలు లభించాయి. తాజాగా ఆ పోస్ట్‌ను సోషల్ మీడియా వినియోగదారులు గుర్తుచేసుకుని మహిళా పైలట్లకు నివాళులర్పిస్తున్నారు. విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు పైలట్లు సుమిత్ కపూర్, శాంభవి పాఠక్, పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్, విమాన సహాయకురాలు పింకీ మాలి ఉన్నారు. అందరూ ప్రమాదంలో కాలిపోయారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar Plane Crash: పైలట్ సుమిత్ కపూర్ స్నేహితులు సంచలన వ్యాఖ్యలు
కెప్టెన్ శాంభవి పాఠక్ ఫస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో ఫ్లైట్ క్రూ శిక్షణ పొందింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి ఫ్రోజెన్ ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ (ATPL) పొందింది. శాంభవి పాఠక్‌కు సుమిత్ కపూర్ పైలట్-ఇన్-కమాండ్‌గా ఉన్నారు. సుమిత్ కపూర్‌కు 15,000 గంటలు, శాంభవి పాఠక్‌కు 1,500 గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఉంది. వాతావరణ పరిస్థితులపై కూడా చాలా అవగాహన ఉన్నవారే. ఇక పింకీ మాలి తొలుత ఎయిరిండియాలో పని చేసిన అనుభవం ఉంది. ఈ మధ్యే ఆమె ప్రైవేటు విమాన సంస్థలోకి వచ్చింది.
When we travel by helicopter or plane, if our plane or helicopter lands smoothly, we understand that the pilot is a woman.#NCPWomenPower
— Ajit Pawar (@AjitPawarSpeaks) January 18, 2024
