NTV Telugu Site icon

Mumbai: స్కూల్ వార్షికోత్సవంలో ఐశ్వర్య దంపతుల డ్యాన్స్.. వీడియో వైరల్

Aishwarya

Aishwarya

ముంబై ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో గురువారం బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కలిసి హాజరు కావడం ఇంట్రెస్టింగ్‌ మారింది. దంపతులిద్దరూ నవ్వుతూ.. ఉల్లాసంగా కనిపించారు. ఇక ఇదే స్కూల్‌లో కుమార్తె ఆరాధ్య విద్యాభాస్యం చేస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా సందడి చేశారు. తాజాగా స్కూల్ విద్యార్థులతో కలిసి ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్ దంపతులు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: BRS: ధరణి సాప్ట్ వేర్లో ఎలాంటి తప్పులు లేవు.. ధరణి వచ్చాకే రైతులకు లాభాలు

ఈ ప్రోగ్రామ్‌లో ఐశ్వర్య దంపతులతో పాటు బాలీవుడ్ స్టార్లు షారూఖ్‌ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు, కుమార్తె సుహానా ఖాన్ కూడా హాజరయ్యారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, తదితర తారలంతా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. కరీనా కుమారులు తైమూర్, జెహ్ కూడా అంబానీ స్కూల్‌లోనే చదువుతున్నారు. ఇక వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులతో కలిసి షారూఖ్‌ఖాన్ కూడా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 

 

Show comments