Site icon NTV Telugu

Airbus Beluga: ప్రపంచంలో అతిపెద్ద కార్గో విమానం హైదరాబాద్‌లో దిగింది..ప్రత్యేకతలు ఇవే..

Airbus Beluga

Airbus Beluga

Airbus Beluga: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఎయిర్ బస్ బెలూగాగా పిలిచి ఈ తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం ఇప్పటి వరకు 2 సార్లు హైదరాబాద్‌కి రాగా, ఇది మూడోసారి. శుక్రవారం తెల్లవారుజామున 12.17 గంటలకు శంషాబాద్‌లో విమానం దిగింది. అంతకుముందు డిసెంబర్ 2022, ఆగస్టు 2023లో ఈ విమానం ఇక్కడకు వచ్చింది.

బెలూగా, అధికారికంగా ఎయిర్‌బస్ A300-608ST అని పిలుస్తారు. ఇంధనం నింపుకోవడానికి, సిబ్బంది విశ్రాంతి కోసం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వస్తూ మార్గం మధ్యలో హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. ఇక్కడ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు థాయ్‌లాండ్ బయలుదేరింది. అంతకుముందు 2022లో కూడా థాయ్‌లాండ్ పట్టాయా ఎయిర్‌పోర్టుకు వెళ్తూ హైదరాబాద్‌ని దర్శించింది.

Read Also: ENG vs WI: 8 స్ధానంలో వ‌చ్చి సెంచ‌రీతో చెల‌రేగిన అట్కిన్సన్.. లార్డ్స్లో అరుదైన రికార్డ్!

దీని ప్రత్యేకతలు ఇవే:

బెలూగా దాని ఆకారం కారణంగా ఇతర విమానాలతో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ‘‘వేల్ ఆఫ్ ది స్కై’’ అని దీనిని పిలుస్తారు. సంప్రదాయ కార్గో విమానాల్లో సాధ్యం కాని భారీ కార్గో కోసం దీనిని ప్రత్యేకంగా నిర్మించారు. 56 మీటర్లు (184 అడుగులు) పొడవు మరియు 44.84 మీటర్లు (147 అడుగులు) రెక్కల విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎయిర్‌క్రాఫ్ట్ భాగాలైన రెక్కలు, ఫ్యూజ్ లెస్ సెక్షన్‌ని తరలించడానికి ఉపయోగిస్తారు. ఇది పారిశ్రామిక యంత్రాలు, శాటిలైట్లని కూడా ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది. దీని కార్గో హోల్డ్ 7.1 మీటర్లు( 23 అడుగులు) వ్యాసం కలిగి ఉంటుంది. ఈ విమానం ఏకంగా 47 టన్నుల భారీ కార్గోని కూడా మోయగలదు.

Exit mobile version