Site icon NTV Telugu

Delhi Weather: దీపావళితో మరింత క్షీణించిన ఢిల్లీ వాతావరణం

Delhi2

Delhi2

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది. దీనికి దీపావళి పండుగ తోడైంది. నిన్నటిదాకా ఒకెత్తు.. ఈరోజు మరొకెత్తుగా మారిపోయింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 350 దగ్గర నమోదైంది. ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత నమోదు కావడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Karoline Leavitt: ట్రంప్-పుతిన్ భేటీపై ప్రశ్న.. పరుష పదం ఉపయోగించిన కరోలిన్‌ లీవిట్‌

వాస్తవంగా ఢిల్లీలో గ్రీన్ కాకర్స్ కాల్చుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా దీనికంటూ ఒక సమయాన్ని కూడా కేటాయించింది. కానీ గ్రీన్ కాకర్స్ కాకుండా పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి కాల్చినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం వాతావరణం చాలా మబ్బుగా కనిపిస్తోంది. పూర్తిగా గాలి నాణ్యత కోల్పోయింది. దీంతో గ్రీన్ క్రాకర్స్ కాకుండా విపరీతంగా రాకెట్లు, బాణాసంచా కాల్చి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Shehbaz Sharif: దీపావళి శుభాకాంక్షలపై ఆగ్రహావేశాలు.. పాక్ ప్రధానిపై నెటిజన్ల మండిపాటు

ఢిల్లీలోని ఆనంద్ విహార్ అనేది రాజధానిలో అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ చాలా ఏళ్లుగా బాణాసంచా నిషేధం ఉంది. అయితే సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. కానీ గ్రీన్ క్రాకర్స్ కాకుండా రాకెట్లు, బాణాసంచా విపరీతంగా కాల్చినట్లు సమాచారం. దీంతోనే గాలి నాణ్యత కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. ఈ ఏడాది కాలుష్యాన్ని తగ్గిద్దామనుకున్న అధికారులకు ఎదురుదెబ్బే తగిలింది. అక్టోబర్ 21, 2025న ఉదయం 8 గంటలకు ఆనంద్ విహార్ స్టేషన్ AQI 360 దగ్గర నమోదైంది. 2024లో 396, 2023లో 312, 2022లో AQI 356 నమోదైంది.

తాజా పరిణామాలపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా తప్పుపట్టారు. గ్రీన్ క్రాకర్లు కూడా 30 శాతం కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. వాయు కాలుష్యం కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని దాదాపు మూడు దశాబ్దాలుగా స్వచ్ఛమైన గాలి కోసం పోరాడుతున్నట్లు పర్యావరణవేత్తలు వాపోయారు.

గాలి నాణ్యతను నాలుగు దశలుగా వర్గీకరిస్తారు. స్టేజ్-1 (పేలవమైనది AQI 201–300), స్టేజ్-2 (చాలా పేలవమైనది 301–400), స్టేజ్-3 (తీవ్రమైనది 401–450), స్టేజ్-4 (తీవ్రమైనది ప్లస్, 450 కంటే ఎక్కువ)గా గుర్తిస్తారు.

వైద్యుల అభిప్రాయం ప్రకారం శీతాకాలంలో ఢిల్లీలోని గాలి విషపూరితంగా మారడానికి ప్రతికూల వాతావరణం. వాహనాల ఉద్గారాలు, పంటలు కాల్చడం, బాణసంచా కాల్చడం, స్థానిక కాలుష్య వనరులు కారణం అవుతుంటాయి. ఢిల్లీలోని కలుషిత గాలిని పీల్చడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలు ఉంటాయని.. రోజుకు 10 సిగరెట్లు కాల్చడంతో సమానమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కాలుష్యానికి గురైతే ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని.. అంతేకాకుండాగుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు.

 

Exit mobile version