Air India: ఇజ్రాయిల్‌లో వాణిజ్య నగరమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం టార్గెట్‌గా హౌతీ తీవ్రవాదులు ఆదివారం క్షిపణి దాడి చేశారు. విమానాశ్రయం మూడో టెర్మినల్‌కి అతి తక్కువ దూరంలో క్షిపణి పడింది. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దాడి చేసిన వారు 7 రెట్లు దాడులు ఎదుర్కొంటారని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ హెచ్చరించారు.
Read Also: Viral Video: ఇజ్రాయిల్ అతిపెద్ద ఎయిర్‌పోర్టుపై హౌతీ క్షిపణి దాడి.. వైరల్ అవుతున్న వీడియో..
ఈ దాడి నేపథ్యంలో ఎయిర్ ఇండియా టెల్ అవీవ్ విమానాలను వచ్చే రెండు రోజు పాటు నిలిపేసింది. మే 6 వరకు విమానాలు నడపడం లేదని చెప్పింది. ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానాన్ని అబుదాబికి మళ్లించామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులకు టికెట్ డబ్బుల్ని రీఫండ్ చేస్తామని చెప్పింది. ప్రయాణీకులు మరియు సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
