Air India Plane Crash: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Vijay Rupani: విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని!
టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానం సిగ్నల్ కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక సమయంలో మధ్యాహ్నం 1.17 గంటలకు టేకాఫ్ అయింది. కొన్ని నిమిషాల్లోనే విమానం తన ఎత్తును కోల్పోయింది. వెంటనే నేలను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. విమానం కింద పడుతున్న సమయంలో 825 అడుగుల ఎత్తులో ఉంది. గాయపడిన అనేక మంది ప్రయాణికులను ఇప్పటికే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో వైద్య మరియు అగ్నిమాపక సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం 100 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది.
What a tragedy.
Air India flight to London crashes soon after takeoff in Ahmedabad.
Flight AI-171, a Boeing Dreamliner 787, crashed with more than 240 people on board.
One of the worst air tragedies of recent times. #planecrash pic.twitter.com/0FnMnxdvXT— Abhijit Majumder (@abhijitmajumder) June 12, 2025
