Air India: ఎయిరిండియా అంతర్జాతీయ విమానంలో మరోసారి సాంకేతిక సమస్య ఏర్పడింది. అమెరికా న్యూజెర్సీలోని నెవార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానాన్ని స్వీడన్ లోని స్టాక్ హోమ్ కి మళ్లించారు. బోయింగ్ 777-300ఈఆర్ విమానంలోని ఒక ఇంజిన్ లో ఆయిల్ లీక్ కావడంతో సాంకేతిక సమస్య తలెత్తిందని డీజీసీఏ వెల్లడించింది. బుధవారం ఈ ఘటన జరిగింది. ఆయిల్ లీక్ కావడంతో ఒక ఇంజిన్ షట్ డౌన్ అయిందని దీంతో స్టాక్ హోమ్ లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Read Also: Actor Prabhu: నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత.. ఆ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స
విమానం ఎయిర్ పోర్టులో దిగే సమయానికి ఫైర్ ఇంజిన్లతో గ్రౌండ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ ఇన్‌స్పెక్షన్ సమయంలో, ఇంజిన్ నెంబర్ 2 డ్రెయిన్ మాస్ట్ నుండి ఆయిల్ బయటకు రావడం కనిపించిందని అధికారులు తెలిపారు. మొత్తం 300 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అంతా సేఫ్ గా ఉన్నారని అధికారులు తెలిపారు. అంతకు ముందు సోమవారం న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా లండన్ కు మళ్లించారు.