Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం మరవక ముందే, ఇదే సంస్థకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో విమానం పొట్ట నుంచి బయటకు వచ్చే రామ్ ఎయిర్ టర్బైన్(RAT) ఎలాంటి హెచ్చరికలు లేకుండా బయటకు వచ్చింది. దీంతో విమానం యూకేలోనే నిలిచిపోయింది.
Read Also: Alcohol Addiction: పైసా సంపాదన ఉండదు.. రాత్రి లేదు పగలు లేదు.. నిత్యం చుక్క పడాల్సిందే
అమృత్ సర్ నుంచి బర్మింగ్ హామ్ వెళ్లిన AI117లో ఈ సంఘటన జరిగింది. ర్యాట్ బయటకు వచ్చినప్పటికీ, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారు. ల్యాండింగ్ తర్వాత అన్ని విద్యుత్, హైడ్రాలిక్ వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని ఎయిర్ లైన్స్ ధ్రువీకరించింది.
రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) అనేది విమానం ఇంజిన్ శక్తిని లేదా ఇతర ప్రధాన విద్యుత్ వనరులను కోల్పోయినప్పుడు విద్యుత్ కోసం విమానం నుంచి బయటకు వస్తుంది. ఇది టర్బయిన్‌లా పనిచేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. విమానంలో కీలకమైన వ్యవస్థలకు విద్యుత్‌ను అందిస్తుంది.
