Site icon NTV Telugu

Air India: అహ్మదాబాద్‌లో కూలిన ఎయిరిండియా విమానం

Air India

Air India

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం కూలిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం కూలిపోయినట్లుగా తెలుస్తోంది. సంఘటనాస్థలికి 12 ఫైరింజన్లు చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. ఇక విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.  ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిపోవడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి.

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం కూలిపోయింది. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు సమాచారం. చెట్టును ఢీకొట్టి విమానం కూలిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఆస్తి, ప్రాణ ఎక్కువగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక సమాచారం అందుకున్నకేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన గుజరాత్‌కు బయల్దేరారు. అలాగే స్థానిక అధికారులు, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులు సమీక్షిస్తున్నారు.

 

https://www.youtube.com/watch?v=ET3gboq42Rs

Exit mobile version