Air India Crash: గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అంతా మరణించారు. విమానం కూలడంతో నేలపై ఉన్న 19 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఇటీవల వెలువడిన ప్రాథమిక నివేదిక ‘‘ఇంధన నియంత్రణ స్విచ్‌ల’’పై సందేహాలు వ్యక్తం చేసింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్చ్‌లు ‘‘రన్’’ నుంచి ‘‘కటాఫ్’’ పొజిషన్‌లోకి మారడంతో ఇంజన్లు పనిచేయడం ఆగిపోయినట్లు నిర్ధారించింది.
Read ALSO: Payal Rajput : పాయల్ అందాల సోయగాలు.. చూశారా..
ఇదిలా ఉంటే, ఈ ఘోర ప్రమాదంలో యాంత్రిక సమస్య లేదా ఇంధన నియంత్రణ యూనిట్ స్విచ్‌లు ఫెయిల్యూర్ వల్ల సంభవించినట్లు కనిపించడం లేదని అమెరికాకు చెందిన ‘‘ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA)’’ చీఫ్ గురువారం వ్యాఖ్యానించారు. బోయింగ్ ఫ్యూయలర్ కంట్రోల్ స్విచ్‌లలో మెకానికల్ సమస్య కనిపించడం లేదని ఎఫ్ఏఏ నిర్వాహకుడు బ్రయాన్ బెడ్‌ఫోర్డ్ విస్కాన్సిన్‌లో జరిగిన ఎయిర్ షోలో చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బోయింగ్, ఎయిర్ ఇండియా వెంటనే వ్యాఖ్యానించలేదు. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు విమానంలోని ఇంజన్లకు ఇంధనాన్ని నియంత్రిస్తాయి. ఈ స్విచ్‌లలో సాంకేతిక లోపంతోనే విమానం కుప్పకూలినట్లు దర్యాప్తు చేస్తున్నవారు అనుమానిస్తున్నారు.
