NTV Telugu Site icon

Indian Air Force: ఎయిర్‌ఫోర్స్ మహిళా అధికారిపై వింగ్ కమాండర్‌ అత్యాచారం.. ఆరోపణలపై ఇంటర్నల్ ఎంక్వైరీ..

Indian Air Force

Indian Air Force

Indian Air Force: జమ్మూ కాశ్మీర్‌లోని వైమానికి దళ స్టేషన్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేసే అధికారి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపించడం సంచలనంగా మారింది. అత్యాచారం, మానసిక వేధింపులు, నిరంతర వేధింపులకు పాల్పడినట్లు మహిళా అధికారి ఆరోపించడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఇంటర్నల్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వింగ్ కమాండర్‌పై మహిళా అధికారి ఫిర్యాదు చేయడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Read Also: Haryana Polls: లాడ్వాలో ముఖ్యమంత్రి సైనీ నామినేషన్.. హాజరైన కేంద్రమంత్రి ఖట్టర్

వింగ్ కమాండర్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376(2) కింద బుద్గామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది, ఇది అధికారిక హోదాలో ఉన్న వ్యక్తులు చేసిన తీవ్రమై అత్యాచారానికి సంబంధించింది. మహిళా అధికారి ఫిర్యాదు ప్రకారం.. డిసెంబర్ 31, 2023 రాత్రి ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో అధికారి తన గదిలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. 2021లో జరిగిన ఇలాంటి ఘటనలో ఐఏఎఫ్ మహిళా పైలట్ తన ఫ్లైట్ కమాండర్‌ తనని లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ జమ్మూకాశ్మీర్ హైకోర్టును ఆశ్రయించారు.