Uttar Pradesh: అసదుద్దీన్ ఓవైసీ లేకుండా అఖిలేష్ సీఎం కావడం కలే!
- అఖిలేష్ సీఎం కావాలంటే అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ఉండాల్సిందే..
- ఓవైసీ లేకుండా ఎస్పీ చీఫ్ అధికారంలోకి రావడం కష్టమే..
- కీలక వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత షాదాబ్ చౌహాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ల మధ్య తీవ్ర పోటీ ఉంది. అయితే, ఎన్నికల్లో కూడా ఏఐఎంఐఎం పార్టీ కూడా కీలక పాత్ర పోషించబోతోంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తర్ ప్రదేశ్ సీఎం కావాలంటే అసదుద్దీన్ ఓవైసీ మద్దతు తీసుకోవాల్సిందే అని ఎంఐఎం నేత షాదాబ్ చౌహాన్ అన్నారు. అఖిలేష్ రాజకీయ వ్యూహం ఓవైసీ లేకుండా పూర్తి కాదని అన్నారు. ఎస్పీ అవలంభిస్తున్న PDA (పిచ్ఛడా, దళిత్, అల్పసంఖ్యాకులు) ఫార్ములాలోని ‘A’ అంటే అసదుద్దీన్ ఒవైసీ కావాలని ఎద్దేవా చేశారు.
అఖిలేష్ యాదవ్ PDAలో అసదుద్దీన్ ఒవైసీకి ‘A’ చోటు దక్కే వరకు ఆయన అధికారంలోకి రావడం కలే అని అన్నారు. ఎస్పీ వెనకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను కలుపుకుని రాజకీయ వ్యూహాన్ని రచిస్తోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌పై షాదాబ్ చౌహాన్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన బీజేపీని ప్రశంసిస్తున్నారని ఆరోపించారు. మసూద్ వ్యాఖ్యలు చూస్తే అధికార పార్టీ బీజేపీతో రాజకీయంగా కలిసిపోయినట్లు అనిపిస్తోందని అన్నారు. అఖిలేష్ యాదవ్ తన సొంత సామాజిక ఓటు బ్యాంకుపై మరింత దృష్టి సారించాలని, ఆయనకు మద్దతుగా ఉన్న కొన్ని వర్గాలు బీజేపీ వైపు వెళ్తున్నాయని హెచ్చరించారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!