Waqf: దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలను తొలగిస్తూ, సవరణలతో కొత్త బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. దీనిపై ప్రతిపక్షాల అభ్యంతరం కారణంగా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించింది. ఈ కమిటీ తన రిపోర్టుని పార్లమెంట్‌కి సమర్పించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also: Starlink: స్పేస్ ఎక్స్‌తో ఎయిర్‌టెల్, జియో జట్టు.. భారతీయులకు ఏం లాభం..? ఇంటర్నెట్ ధరలు ఎంత..?
అయితే, తాజాగా ఎంఐఎం నేత ఇమ్రాన్ సోలంకి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కోల్‌కతాలోని క్రికెట్ స్టేడియం ‘‘ఈడెన్ గార్డెన్’’ కూడా వక్ఫ్ ఆస్తి అని క్లెయిమ్ చేశారు. భారత సైన్య తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఫోర్ట్ విలియ కూడా వక్ఫ్ ఆస్తి అని పేర్కొన్నారు. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో వక్ఫ్‌కు 105 ఆస్తులు ఉన్నట్లు ఇమ్రాన్ చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఈ స్టేడియం కోసం రాష్ట్ర ప్రభుత్వమే అద్దె చెల్లిస్తోందని అన్నారు. బెంగాల్‌లో అత్యధిక వక్ఫ్ భూమి ఉందని సోలంకి పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలోనే వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ గరిష్టంగా ఉందని చెప్పారు. 8000 చోట్ల వక్ఫ్ భూమి ఆక్రమణకు గురైందని, వీటిలో ఈడెన్ గార్డెన్ భూమి కూడా ఉందని చెప్పారు.
"Eden Gardens is WAQF property."
~ Imran Solanki, AIMIM Leader
Next what??
West Bengal is WAQF Property?
India is WAQF Property? pic.twitter.com/F9vPdGKvaE— Incognito (@Incognito_qfs) March 12, 2025