Yunus Shaikh:ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది. ఇదే కాకుండా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, మాలేగావ్, నాందేడ్, అమరావతి, ధులే, షోలాపూర్, నాగ్‌పూర్, థానే మున్సిపల్ కార్పొరేషన్‌లలో కూడా ఎంఐఎం సత్తా చటాటింది. మొత్తంగా మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 125 స్థానాలను గెలుచుకుంది. ఈ గెలుపుపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ గెలుపు తర్వాత ఎంఐఎం ఒక వివాదంలో ఇరుక్కుంది. కొన్ని రోజుల క్రితం ఎంఐఎం కార్పొరేటర్ సహర్ యూనస్ షేక్ వివాదాస్పదలు చేశారు. ‘‘ముంబ్రాను ఆకుపచ్చగా మార్చాలి’’ అనే వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ముంబ్రా పోలీస్ స్టేషన్‌లో ఆమె లిఖితపూర్వకంగా క్షమాపణ పత్రాన్ని సమర్పించారు. తాను త్రివర్ణ పతాకానికి విధేయత చూపుతానని చెప్పింది.
ఆమె చేసిన వ్యాఖ్యలపై రెండు సార్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపించినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ అనిల్ షిండే చెప్పారు. ఆమె తన ప్రకటనలకు క్షమాపణ చెప్పిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు ఆమె క్షమాపణల్ని అంగీకరించినప్పటికీ, మళ్లీ ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముంబ్రా పోలీసులకు చేసిన భావోద్వేగ ప్రకటనలో..‘నేను మన త్రివర్ణ పతాకం కోసమే జీవిస్తాను, మరణిస్తాను’’ అని దేశ జాతీయ గుర్తింపును తాను ఎప్పటికీ అగౌరవపరచనని చెప్పింది.
అయితే, ఈమె క్షమాపణలతో బీజేపీ నేత కిరిట్ సోమస్య సంతృప్తి చెందలేదు. ఆమె వయసు 22 ఏళ్లే అని, ఈ సంఘటనను నిశితమైన రాజకీయ వ్యూహంలో భాగమని అభివర్ణించారు. దీని వెనక పెద్ద కుట్ర ఉందని, ఇది ఓట్ జిహాద్ అంటూ హెచ్చరించారు. ముంబైపై కన్నేసిన ఎంఐఎం, ఇతర ప్రాంతాల్లో ఈ వ్యూహాలను పరీక్షిస్తోందని ఆరోపించారు. దీనిని తాము జరగనిచ్చేది లేదని చెప్పారు.
