Site icon NTV Telugu

AIIMS Name Change: ఎయిమ్స్ పేర్లు మార్పు.. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రతిపాదన

Aiims

Aiims

AIIMS will be Named After Freedom Fighters, Regional Heroes: దేశంలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)పేర్లు మార్చబోతోంది కేంద్రం ప్రభుత్వం. ఇందు కోసం ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదన చేసింది. దేశంలో మొత్తం 23 ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి.

దేశంలో ఢిల్లీ ఎయిమ్స్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అన్ని ఎయిమ్స్ మెడికల్ కాలేజీల పేర్లను మార్చనుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రాంతీయ వీరులు, స్వాతంత్య్ర సమరయోధులు, చారిత్రక సంఘటనలు, స్మారక చిహ్నాలు, ప్రత్యేక భౌగోళిక గుర్తింపుల పేర్లతో ఎయిమ్స్ కు నామకరణం చేయనున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎయిమ్స్ లకు నిర్దిష్ట పేర్లను ఇవ్వడానికి ఒక ప్రాతిపదికను రూపొందించింది. ఇందులో ఎయిమ్స్ ను మూడు రకాలుగా వర్గీకరించారు. పూర్తిగా పనిచేస్తున్నవి, పాక్షికంగా పనిచేస్తున్నవి, నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ అనే మూడు రకాలుగా వర్గీకరించారని తెలుస్తోంది.

Read Also: CPI Narayana: బీజేపీని అడ్డుకునేందుకే టీఆర్ఎస్‌కు మద్దతు

ప్రస్తుతం దేశంలో కొత్తగా ఆరు ఎయిమ్స్ బీహార్ (పాట్నా), ఛత్తీస్ గఢ్( రాయ్ పూర్), మధ్యప్రదేశ్ (భోపాల్), ఒడిశా (భువనేశ్వర్), రాజస్థాన్ (జోధ్‌పూర్), ఉత్తరాఖండ్ (రిషికేశ్) ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన ఫేజ్ 1లో ఆమోదించబడ్డాయి. ఇవి పూర్తిగా పనిచేస్తున్నాయి. 2015-2022 మధ్య ప్రారంభం అయిన 16 ఎయిమ్స్ లో 10 ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీబీఎస్ తరగతులు, ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ సేవలను ప్రారంభించగా.. మరో రెండింటిలో ఎంబీబీఎస్ తరగతులు మాత్రమే ప్రారంభం అయ్యాయి. మిగిలిన నాలుగు నిర్మాణంలో ఉన్నాయి.

Exit mobile version