NTV Telugu Site icon

హోమ్ ఐసోలేషన్ లో ఆ మెడిసిన్ ను వాడొద్దు… 

కరోనా మహమ్మారి ఉధృతి దేశంలో ఏ మాత్రం తగ్గడం లేదు.  రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  15 రాష్ట్రాల్లో లాక్ డౌన్, కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించారు.  ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు.  లాక్ డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్న తరుణంలో కొంతమేర పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.  అయితే, కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు రెమ్ డెసీవర్ మెడిసిన్ వాడుతున్నారు.  ఇలా స్వల్ప లక్షణాలు ఉన్న వ్యక్తులు మాత్రమే హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారని, తీవ్రత అధికంగా ఉన్న వ్యక్తులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, అత్యవసరమైతేనే ఈ మెడిసిన్ ను వినియోగించాలని ఎయిమ్స్ వైద్యులు సూచిస్తున్నారు.  హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు పాజిటివ్ దృక్పధంతో ఉంటూ వ్యాయామం వంటివి చేస్తే సరిపోతుందని, తప్పనిసరిగా మాస్క్ వినియోగిస్తూ 8 గంటలకు ఒకసారి తప్పనిసరిగా మాస్క్ ను చేంజ్ చేయాలని ఎయిమ్స్ వైద్యులు సూచిస్తున్నారు.