Site icon NTV Telugu

Mallikarjun Kharge: 13న రాయ్‌పూర్‌..18న తెలంగాణ‌.. ప్రచార ప‌ర్వానికి ఖ‌ర్గే శ్రీకారం..!

Malli Karjuna Kharge

Malli Karjuna Kharge

Mallikarjun Kharge: తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ నెల 18న పర్యటించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13న రాయ్‌పూర్‌లో జరిగే ర్యాలీతో ఖర్గే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 18న తెలంగాణలో, 22న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో, 23న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ర్యాలీల్లో పాల్గొంటారు. ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపైనే ప్రధానంగా దృష్టి సారించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు తెలంగాణలో అధికారాన్ని కోల్పోయింది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. ఈ దిశగా పార్టీ వ్యూహరచన చేస్తుంది.

Read also: Jagital: అక్కడ హెల్మెట్‌ ధరించాల్సిందే.. రోడ్డు మీద కాదండోయ్‌ ఆఫీస్‌ లో..!

ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్లాలంటే ఎలాంటి వ్యూహంతో రాహుల్ గాంధీతో మల్లికార్జున ఖర్గే చర్చించారు. ఈ ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీలను నియమించారు. తెలంగాణ కోసం కేరళ ఎంపీ మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టుదలతో ఉంది. తెలంగాణలో ఎన్నికలకు సమయం తక్కువ. దీంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పరిస్థితి, ఇతర పార్టీల బలాబలాలపై చర్చ జరగనుంది. ఎన్నికల్లో ఫలితాలు వచ్చే తీరుపై ఖర్గే నేతలతో చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఖర్గే చర్చించనున్నారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
Bablu IIIT Student: ఐఐఐటీ మరో విద్యార్థి మృతి.. హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య..!

Exit mobile version