Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. రేపు మధ్యాహ్నం వరకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే విషయం తెలుస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మరోసారి కర్ణాటకలో హంగ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలుపొందినా.. మ్యాజిక్ ఫిగర్ 113 చేరే అవకాశం లేదని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం తాము 140 కన్నా ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కూడా ఇదే విధంగా చెబుతోంది. జేడీయూ కింగ్ మేకర్ పాత్రను పోషించేందుకు సన్నద్ధం అవుతోంది.
Read Also: CM YS Jagan: దివ్యాంగులను అక్కున చేర్చుకున్న సీఎం.. ఏడుగురికి తక్షణమే సాయం..
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై అంతా ఆసక్తి నెలకొంది. అయితే చివరి ఫలితం వచ్చే వరకు సీఎం ఎవరనేదానిపై మాట్లాడవద్దని ఇటు డీకే శివకుమార్ కు, అటు సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. నిన్నటి నుంచి వీరిద్దరితో ఏఐసీసీ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన 223 కాంగ్రెస్ అభ్యర్థులతో సిద్దరామయ్య, శివకుమార్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ కూడా వరస సమావేశాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే యడియూరప్ప, సీఎం బసవరాజ్ బొమ్మై, కీలక నేతలు సమావేశం అయ్యారు.
