Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
- అన్నాడీఎంకేకు బిగ్ షాక్
- ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
- సీఎం విజయ్ సమక్షంలో టీవీకేలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఏఐఏడీఎంకేలో చీలికలు పళనిస్వామికి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే విజయ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. చీలికలను పళనిస్వామి చక్కదిద్దే పనిలో ఉండగా ముగ్గురు ఎమ్మెల్యేలు షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేసి టీవీకే గూటికి చేరారు. అన్నాడీఎంకేకు చెందిన సత్యభామ, మరగాథం, జయకుమార్‌లు.. స్పీకర్ ప్రభాకర్‌ను కలిసి రాజీనామా లేఖలు అందజేశారు. వెంటనే స్పీకర్ కూడా ఆమోదించేశారు. అనంతరం ముఖ్యమంత్రి విజయ్ను కలిసి టీవీకేలో చేరిపోయారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అధికారంలోకి రాకపోవడంతో పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు మొదలైంది. ఇందులో కొంత మంది పళనిస్వామి వైపు.. ఇంకో 17 మంది ఎమ్మెల్యేలు ఎస్పీ వేలుమణి క్యాంప్‌లో చేరారు. అయితే రెండు వర్గాలను కలిపేందుకు తెరవెనుక రాజీ చర్చలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో భవిష్యత్తు కోసం ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ముగ్గురు ఎమ్మెల్యేల సంచలన రాజీనామాతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 స్థానాలు గెలుచుకుంది. అనంతరం కాంగ్రెస్ మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ విజయం సాధించారు. ప్రస్తుతం సంపూర్ణ మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పడింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..