Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: దర్యాప్తు అధికారికి ముప్పు.. ఎక్స్‌ కేటగిరీ భద్రత కేటాయింపు

Ahmedabadairaccident

Ahmedabadairaccident

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న బ్యూరో చీఫ్ జీవీజీ యుగంధర్‌‌కు ముప్పు పొంచి ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి సమాచారం అందించాయి. దీంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తం అయింది. యుగంధర్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించాలని ఆదేశించింది. సీఆర్‌పీఎఫ్‌ కమాండోలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Amit Shah: రేపు తెలంగాణకు అమిత్ షా.. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం

ఇదిలా ఉంటే విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్‌లో రికార్డైన డేటాను దర్యాప్తు సంస్థలు సేకరించాయి. ఈ మేరకు కేంద్రం కూడా ధృవీకరించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థలకు ముప్పు పొంచి ఉన్నట్లుగా కేంద్రానికి సమాచారం అందింది. దీంతో వారికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించాయి.

ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 13 మంది సైనికులు మృతి

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరింది. కొన్ని సెకన్లలోనే హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్‌లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Exit mobile version