NTV Telugu Site icon

Kiccha Sudeep: బీజేపీలో చేరనున్న స్టార్ హీరోలు.. కాషాయ పార్టీలోకి కిచ్చా సుదీప్, దర్శన్

Sudeepa, Darshan

Sudeepa, Darshan

Kiccha Sudeep: వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న కర్ణాటక ఎన్నికలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ ఎన్నికలను లోక్ సభ ఎన్నికల ముందు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కన్నడ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

Read Also: Donald Trump: ట్రంప్ అరెస్ట్, విడుదల.. అమెరికాను నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం..

ఇదిలా ఉంటే కన్నడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కన్నడ స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగదీప బీజేపీలో చేరుతున్నట్లు తెలిసింది. ఈ రోజు బెంగళూర్ లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలో వీరిద్దరు కాషాయ కండువాను కప్పుకోనున్నారు. ఓ ప్రైవేట్ హోటల్ లో వీరిద్దరి చేరిక ఉండే అవకాశం ుంది. మధ్యాహ్నం 1.30-2.30 మధ్య వీరు బీజేపీలో చేరనునన్నారు.

కర్ణాటకలో వీరిద్దరికి మాస్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది అభిమానులు ఉన్నారు. సుదీప్, దర్శన్ చేరికతో బీజేపీ విజయావకాశాలు పెరుగుతాయని ఆ పార్టీ భావిస్తోంది. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగబోతునున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది.